​​​​​​బెంగాల్‌పై దృష్టి పెట్టి కొవిడ్‌ను గాలికొదిలేశారు - covid crisis result of centre doing no work in last 6 months: mamata
close
Updated : 09/05/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​బెంగాల్‌పై దృష్టి పెట్టి కొవిడ్‌ను గాలికొదిలేశారు

కోల్‌కతా: కరోనా ఉద్ధృతికి కేంద్రమే కారణమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఆరు నెలల పాటు కేంద్రం ఏ పనీ చేయలేదని దుయ్యబట్టారు. అధికారాన్ని ఒడిసిపట్టేందుకు కేంద్రమంత్రులు, ఇతర నేతలు ఇక్కడే తిష్ట వేశారన్నారు. ఆ కారణంగానే దేశంలో కరోనా కేసులు ఉద్ధృతమయ్యాయని ఆరోపించారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఎన్నిక అనంతరం శనివారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామంటూ దేశాన్ని పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. పార్టీ పెద్దలు సహా, కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంలో మునిగిపోయారంటూ ఎద్దేవాచేశారు.

ఎన్నికల కమిషన్‌ సహకరించకపోయి ఉంటే వారికి కనీసం 30 సీట్లు కూడా వచ్చేవి కాదని భాజపానుద్దేశించి మమత వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల రిగ్గింగ్‌ కూడా జరిగిందని ఆరోపించారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఓటమిని అంగీకరించలేక రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టేందుకు ఫేక్‌ వీడియోలను వైరల్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. సార్వత్రిక టీకా కార్యక్రమం పూర్తి బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. అందుకోసం డబ్బులు వెచ్చించకుండా పార్లమెంట్‌ భవనం, ప్రధాని నివాసం, విగ్రహాల కోసం రూ.50వేల కోట్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. మరోవైపు అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను ప్రతిపక్ష భాజపా బహిష్కరించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని