వంటింటి చిట్కాలతో వైరస్‌ దాడికి అడ్డుకట్ట! - covid infection and home care
close
Published : 28/05/2021 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంటింటి చిట్కాలతో వైరస్‌ దాడికి అడ్డుకట్ట!

                                                    
కరోనా సెకెండ్‌వేవ్‌ ఉద్ధృతిలో మన దగ్గర పాజిటివ్‌ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. చాలాచోట్ల కుటుంబాలకు కుటుంబాలే పాజిటివ్‌గా తేలుతున్నాయి. ఇంట్లో ఒకరికి పాజిటివ్‌ వస్తే మిగతా కుటుంబ సభ్యులు వైరస్‌ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ దాడిని తట్టుకునేందుకు వ్యక్తిగతంగా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇందుకు వంటింట్లోని దినుసులు చాలా ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. వంటింటి చిట్కాలతో కరోనా ప్రభావాన్ని ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకుందాం!

కరోనా కలకలం నేపథ్యంలో ఇవాళ్ల మనలో చాలామంది వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. విటమిన్‌-సి, డి, జింక్‌ తదితర మాత్రలు వాడుతున్నారు. కానీ వంటింట్లో దొరికే పదార్థాలతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఒంట్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. 
*ముందుగా ఉదయం లేవగానే తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకొని వడపోసుకోవాలి. నిత్యం ఒకకప్పు దీన్ని తీసుకుంటే గొంతులో గరగర, జబ్బు నుంచి ఉపశమనం లభిస్తుంది.
*అనంతరం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. వేగంగా నడవటం, యోగా వంటివి చేయవచ్చు,
*అల్పాహారం ఉదయం 8 గంటల లోపు పూర్తి చేయాలి. మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు తీసుకోవచ్చు. అందులో క్యారెట్‌ లేదా ఆకుకూరలు తురిమి వేసుకోవడం మేలు. మొలకలు తీసుకోవడం ద్వారా సీ, ఈ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు అందుతాయి. 
*ఉదయం 10.30 గంటలకు ఈ కాలంలో దొరికే పండ్లు.. జామ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు తీసుకోవాలి. 
*మధ్యాహ్న భోజనంలో రోజూ తినే పదార్థాలతో పాటు ఏదైనా ఆకుకూరతో వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ తదితర కూరగాయలు తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. 
* తగినన్ని ప్రోటీన్లకోసం చేపలు, చికెన్‌ తీసుకోవాలి. శాకాహారులు శెనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్‌ తీసుకోవాలి. 
* సాయంత్రం ఎండు ఫలాలు తీసుకోవాలి. బొబ్బర్లు, అలసందలు, శెనగలు, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే.. జింక్‌, సెలినియమ్‌, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. వీటితో పాటు కాయగూరలు ఉడకబెట్టి, కాస్త మిరియాల పొడి వేసి, సూప్‌ కింద తీసుకోవడం మంచిది. 
*రాత్రి 7.30- 8గంటల లోపు భోజనం పూర్తి చేయాలి. జొన్న, గోధుమ రొట్టెలు పరిమితంగా తీసుకోవాలి. 
*నిద్రించే ముందు ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మేలు. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని