టెలికామ్‌నూ వదలని కొవిడ్‌ - covid not to leave telecom india ratings survey
close
Published : 30/07/2020 03:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెలికామ్‌నూ వదలని కొవిడ్‌

ఇండియా రేటింగ్స్‌ అధ్యయనం

ముంబయి: కొవిడ్‌ ప్రభావం టెలికాం రంగంపైనా పడుతోందని, కొత్త కనెక్షన్లు జతచేసుకోవడంలో ప్రస్తుత పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ పేర్కొంది. దేశంలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ మొదలైన మార్చిలో 28 లక్షలు, పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలైన ఏప్రిల్‌లో 82 లక్షల కనెక్షన్లు తగ్గాయని వివరించింది. ఎక్కువ కనెక్షన్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు తగ్గాయని, రిలయన్స్‌ జియోకు కొంత పెరిగాయని తెలిపింది. కొవిడ్‌ సంక్షోభం వల్ల ఏర్పడిన ఆర్థిక పరిస్థితులే మొబైల్‌ కనెక్షన్లు తగ్గేందుకు కారణమవుతున్నాయని, రాబోయే కొన్ని నెలలు కూడా కొత్త కనెక్షన్లు జతచేసుకునేందుకు కంపెనీలకు ఒత్తిడి తప్పదని వివరించింది. సేవారంగాల నిపుణులు ఇంటి నుంచి పనిచేయడం పెరిగిందని, ఈ ప్రభావం టెలికాం కనెక్షన్లు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీపై ప్రభావం చూపాయని పేర్కొంది.

బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లూ తగ్గాయ్‌
ఏప్రిల్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు కూడా 1.11 కోట్ల మేర తగ్గాయని, గత రెండేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఏజెన్సీ పేర్కొంది. లాక్‌డౌన్‌ పరిస్థితులే ఇందుకు కారణమని వివరించింది. మార్చిలో 58 శాతం మంది బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు కలిగి ఉండగా, ఏప్రిల్‌లో ఈ సంఖ్య 57 శాతానికి తగ్గిందని తెలిపింది.

ఆదాయం పెరిగింది
2019 డిసెంబరులో టెలికాం సంస్థలు టారిఫ్‌లు పెంచడం వల్ల, జనవరి-మార్చి త్రైమాసికంలో టెలికాం రంగ ఆదాయం 11 శాతం పెరిగి, రూ.40,200 కోట్లకు చేరిందని వెల్లడించింది. అయితే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చందాదార్ల సంఖ్య తగ్గినందున, టెలికాం రంగ ఆదాయం ఎలా ఉండనుందో పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని