కొవిడ్‌ను జయిస్తే ఒక్కషాట్‌ టీకా చాలా..! - covid survivors may need just one shot of 2 dose vaccines
close
Updated : 19/04/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ను జయిస్తే ఒక్కషాట్‌ టీకా చాలా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ టీకా డోసులకు సంబంధించి అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికరమైన  అంశాలను వెలుగులోకి తెచ్చింది.  ఒక సారి వైరస్‌ బారినపడి కోలుకొన్నవారిలో ఒకే ఒక్క డోసు టీకానే సమర్థంగా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తోందని తేల్చింది.  లాస్‌ ఏంజెల్స్‌లోని ‘సెడార్స్‌-సినాయ్‌’ మెడికల్‌ సెంటర్‌లోని వాలెంటీర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. కొవిడ్‌ బారిన పడి కోలుకొన్న  దాదాపు 1000 మందితో దీన్ని నిర్వహించారు. వారిలో టీకా ప్రభావాన్ని అధ్యయనం చేశారు. 

గత నెల ఈ పరిశోధన ఫలితాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌-19 నుంచి కోలుకొని టీకా తీసుకొన్న వారి శరీరంలో రోగనిరోధక శక్తి వేగంగా వృద్ధి చెందినట్లు  తేలిందని దీనికి నాయకత్వం వహించిన సుసాన్‌ చెంగ్‌ వెల్లడించారు. కొవిడ్‌ నుంచి బయటపడిన వ్యక్తులకయితే.. ఫైజర్‌ లేదా మోడెర్నా టీకాలు ఒక్క షాట్‌ సరిపోతుంది. ఈ రెండూ ఆర్‌ఎన్‌ఏ టీకాలు.  అసలు వైరస్‌ బారిన పడని వ్యక్తికి రెండు షాట్లతో వచ్చేంత ఫలితాన్ని ఆ ఒక్క షాటే ఇస్తుందని చెబుతున్నారు. 

ఇప్పటికే వైరస్‌ బారిన పడిన 110 మిలియన్ల మందికి పైగా ప్రజలకు  ఆర్‌ఎన్‌ఏ టీకా ఒక డోసు ఇస్తే, మిగిలిన టీకాలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని మేరీ ల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇమ్యూనాలజిస్టు మహమ్మద్‌ సాజిద్‌ తెలిపారు. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఇలాంటి విషయాలనే ఆయన బృందం  వెలుగులోకి తెచ్చింది. కొవిడ్‌ నుంచి కోలుకొన్న వ్యక్తిలోని వ్యాధి నిరోధక శక్తి ఆ వైరస్‌ను గుర్తుంచుకొని ఉంటుంది. తొలి డోసు వ్యాక్సిన్‌కే అది వేగంగా స్పందిస్తుందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సాజిద్‌ తెలిపారు. 

ఫిబ్రవరి నాటి నుంచి పలు ఐరోపా దేశాలు కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారికి ఒక్క డోస్‌ టీకా మాత్రమే ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నాయి. వీటిలో ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, జర్మనీ వంటి దేశాలున్నాయి. ఇజ్రాయెల్‌ మాత్రం తొలుత వ్యాధి నుంచి కోలుకొన్న వారికి టీకా ఇచ్చేందుకు నిరాకరించింది.  కానీ, ఫిబ్రవరి నుంచి మాత్రం ఒక డోసు టీకా ఇస్తోంది.  టీకా తీసుకున్నవారికి యుకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల నుంచి వ్యాపించిన కొవిడ్‌ వేరియంట్ల నుంచి ఈ డోసు ఎక్కువ రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని