మహారాష్ట్ర, దిల్లీలో ఆగని కరోనా విజృంభణ - covid update in delhi maharastra
close
Updated : 29/03/2021 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్ర, దిల్లీలో ఆగని కరోనా విజృంభణ

 మహారాష్ట్రలో 31వేలు.. దిల్లీలో 1900పైనే కొత్త కేసులు

ముంబయి/దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడంలేదు. మహారాష్ట్ర, దిల్లీలలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం మహారాష్ట్రలో 31వేలకు పైగా కొత్త కేసులు రాగా.. దిల్లీలో చాలా రోజుల తర్వాత మళ్లీ 1900 కేసులు రావడం కలవరపెడుతోంది. కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ వ్యాప్తి కొనసాగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. 

మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో 31,643 పాజిటివ్‌ కేసులు, 102 మరణాలు నమోదు కాగా.. ఈ వైరస్‌ బారి నుంచి 20,854మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 1,94,95,189 శాంపిల్స్‌ పరీక్షించగా.. 27,45,518మందిలో వైరస్‌ వెలుగు చూసింది. వీరిలో 23,53,307మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 54,283మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 3,36,584 క్రియాశీల కేసులు ఉన్నాయి. పుణెలో అత్యధికంగా 59,475 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ముంబయిలో 46,248, నాగ్‌పుర్‌ 45,322, ఠానే 35,264, నాసిక్‌ 26,553 చొప్పున ఉన్నాయి. 

డిసెంబర్‌ 13 తర్వాత తొలిసారి దిల్లీలో..

దిల్లీలో గడిచిన 24గంటల్లో 68,805మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 1904మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, కొత్తగా మరో ఆరు మరణాలు నమోదు కాగా.. 1411మంది డిశ్చార్జి అయ్యారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. దిల్లీ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,44,71,835 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,59,619మందికి వైరస్‌ సోకింది. వీరిలో 6,40,575మంది కోలుకోగా.. 11,012మంది మృతిచెందారు. ప్రస్తుతం 8032 క్రియాశీల కేసులు ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌ 13 తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు రావడం ఇదే తొలిసారి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని