మహారాష్ట్రలో కొత్తగా 60వేల కేసులు!   - covid update in maharastra
close
Published : 07/04/2021 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కొత్తగా 60వేల కేసులు!  

ముంబయి: మహారాష్ట్రలో కరోనా రంకెలేస్తోంది. రోజుకో కొత్త రికార్డుతో రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని వారాలుగా రోజురోజుకీ పెరిగిపోతున్న కొత్త కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేసేందుకు ఇప్పటికే టీకా పంపిణీ కొనసాగుతున్నా.. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా ఉద్ధృతి మాత్రం ఆగడంలేదు. తాజాగా బుధవారం ఒక్కరోజే దాదాపు 60వేల కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. దేశంలోకి ఈ మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి ఇంత భారీగా కేసులు రావడం ఇదే తొలిసారి. 

గడిచిన 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 59,907 కొత్త కేసులు, 322 మరణాలు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరో 30,296మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,11,48,736 శాంపిల్స్‌ పరీక్షించగా.. 31,73,261మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 26,13,627మంది కోలుకోగా.. 56,652మంది మరణించారు. ప్రస్తుతం 5,01,559 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

ముంబయిలో వరుసగా రెండో రోజూ 10వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, 6007మంది కోలుకోగా.. 23మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు నగరంలో మొత్తం కేసుల సంఖ్య 4,82,760కి పెరిగింది. వీరిలో 3,88,011మంది కోలుకోగా.. 11,851మంది మృతి చెందారు. ప్రస్తుతం 81,886 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు నాగ్‌పుర్‌లో ఈ రోజు 5338 కొత్త కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని