కరోనా ‘మహా’ కల్లోలం: ఒక్కరోజే 67000+   - covid update in maharastra
close
Published : 17/04/2021 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘మహా’ కల్లోలం: ఒక్కరోజే 67000+ 

దిల్లీలోనూ ఆగని వైరస్‌ ఉద్ధృతి

ముంబయి/దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగిస్తోంది. మహారాష్ట్ర, దిల్లీల్లో మరింతగా ఉరుముతోంది. ఆస్పత్రుల్లో బెడ్‌లు ఖాళీలేక ఓ వైపు, ఆక్సిజన్‌ కొరత మరోవైపు వేధిస్తున్న తరుణంలో శనివారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 67,123 కొత్త కేసులు 419 మరణాలు నమోదు కాగా..దిల్లీలో దాదాపు 24వేల  కేసులు రావడం కలకలం రేపుతోంది. ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

మహారాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 2.35 కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా 37.70 లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 30,61,174 మంది కోలుకోగా.. 59,970మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,47,933 క్రియాశీల కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 56,783మంది కోలుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణెలో అత్యధికంగా 1.20లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. ముంబయిలో 86వేలు, ఠానేలో 82వేలు, నాగ్‌పుర్‌లో 72వేలు, నాసిక్‌లో 40వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ముంబయిలో ఒక్కరోజే 52మంది మృతి

మరోవైపు, ముంబయిలో ఈ ఒక్కరోజే 8800లకు పైగా కొత్త కేసులు వెలుగుచూడగా.. 52 మంది మరణించారు. కొత్తగా 6617మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ముంబయిలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5.70లోలకు చేరింది. వీరిలో 4.69లక్షల మంది కోలుకోగా.. 12,294మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 87,369 క్రియాశీల కేసులు ఉన్నాయి. ముంబయి నగరంలో రికవరీ రేటు 82శాతం ఉండగా.. కేసుల డబ్లింగ్‌ రేటు 44 రోజులుగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

దిల్లీలో ఆక్సిజన్‌ కొరత.. కేజ్రీవాల్‌

దిల్లీలో ఒక్కరోజే 24వేల కేసులు నమోదైనట్టు సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఆక్సిజన్‌, రెమెడెసివిర్‌ కొరత ఉందన్నారు.  రెండు మూడు రోజుల్లో మరో 6వేల పడకలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో 4100 బెడ్‌లు ఇచ్చిందని, ఈసారి మాత్రం కేవలం 1800 పడకలే ఇచ్చినట్టు తెలిపారు. 50శాతం పడకలను కరోనా రోగులకు రిజర్వు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌కు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా కరోనా పరిస్థితిని గమనిస్తున్నామన్నారు. పరిస్థితి మరింతగా క్షీణిస్తే మన ప్రాణాల్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దిల్లీలో పరిమితంగానే ఐసీయూ పడకలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని