మహారాష్ట్రలో వ్యాక్సినేషన్‌ నిలిపివేత - covid vaccination stopped in maharastra till january 18th due to technical issues in cowin app
close
Updated : 17/01/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో వ్యాక్సినేషన్‌ నిలిపివేత

మహారాష్ట్ర: కరోనా టీకా కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కొవిన్‌ యాప్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ నెల 18 వరకు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రలో తొలిరోజు 285 సెంటర్లలో 18,328 మందికి టీకా వేశారు. 

కరోనాను అంతమొందించేందుకు భారత చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తొలి రోజు విజయవంతమైంది. తొలిరోజు 1,92,181 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని కేంద్రం పేర్కొంది. దేశంలో 3351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారు. కొవిన్‌ యాప్‌లో కొన్ని సమస్యలు తలెత్తడంతో అక్కడక్కడ టీకా కార్యక్రమం అలస్యమైంది. 

ఇవీ చదవండి..

వ్యాక్సినేషన్‌ ఒక విప్లవాత్మక ముందడుగు

తొలిరోజు 1,91,181మందికి టీకా: కేంద్రం

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని