భారత్‌లో కరోనా టీకా @ 3 కోట్ల చేరువకు..  - covid vaccine doses reaches 3 crore in india
close
Updated : 14/03/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కరోనా టీకా @ 3 కోట్ల చేరువకు.. 

దిల్లీ : దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఓవైపు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ..  మరోసారి వైరస్‌ విలయతాండవం తీవ్రమవుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 20 వేలకుపైగా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు కొవిడ్‌ను ఎదుర్కొనే టీకా పంపిణీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన టీకాల సంఖ్య 3 కోట్లకు చేరువైంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 57వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా 13వ తేదీన 15,19,952 టీకాలు ఇచ్చారు. వీటిల్లో 24,086 ప్రాంతాల్లో 12,32,131 టీకాలు మొదటి డోసుగా ఇవ్వగా.. మిగతావి రెండో డోసుగా గతంలో టీకా తీసుకున్న వారికి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాల సంఖ్య 2,97,38,409కి చేరిందని తెలిపింది. మరోవైపు భారత్‌.. ఇతర దేశాలకూ వ్యాక్సిన్లను అందిస్తూ తన ఉదారతను చాటుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా 354 మిలియన్‌ డోసులు..
అటు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. 121 దేశాల్లో ఇప్పటి వరకూ 354 మిలియన్‌ డోసుల టీకాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకూ 10 కోట్లకుపైగా టీకాలు పంపిణీ చేశారు. అక్కడ ప్రతి వంద మందికి డోసుల సరఫరా 31.84గా ఉండగా.. భారత్‌లో ఈ సంఖ్య 2.13గా నమోదైంది. ఇక ఇప్పటి వరకూ ఈయూలో 4.85 కోట్ల టీకాలను ఇచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని