టీకాల కోసం గళమెత్తండి: రాహుల్‌గాంధీ - covid vaccine is need of country rahul
close
Published : 12/04/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాల కోసం గళమెత్తండి: రాహుల్‌గాంధీ

దిల్లీ: కరోనా వైరస్‌ ముప్పు నుంచి బయటపడేందుకు పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం టీకాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండు చేశారు. దేశంలో ప్రతిఒక్కరికీ సురక్షితంగా బతికే హక్కు ఉందని.. అందరికీ టీకాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాహుల్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఉందంటూ.. ఆయా ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

‘కొవిడ్‌ ముప్పు నుంచి బయటపడేందుకు దేశ ప్రజలందరికీ టీకాలు అవసరం. ఇందుకోసం అందరూ ప్రభుత్వంపై గళం విప్పాలి. ఎందుకంటే దేశ ప్రజలందరికీ సురక్షితంగా జీవించే హక్కు ఉంది’ అని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. నిన్నకూడా రాహుల్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. కేంద్రం కరోనాను అరికట్టడంలో, రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే అందరికీ టీకాలు అందించాలని డిమాండు చేస్తూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ‘speakupforvaccineforall’ అంటూ ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే.

దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1.68లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 904 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 12లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని