తొలిదశలో 1.65కోట్ల కరోనా వ్యాక్సిన్స్‌ డోసులు - covishield and covaxin have been allocated to all states says health ministry
close
Published : 14/01/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలిదశలో 1.65కోట్ల కరోనా వ్యాక్సిన్స్‌ డోసులు

న్యూదిల్లీ: కరోనా మహమ్మారిని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అత్యవసర వినియోగం నిమిత్తం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు అనుమతినివ్వడమే కాకుండా వివిధ రాష్ట్రాలకు వాటి సరఫరాను కూడా ప్రారంభించింది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల డేటా ప్రకారం మొత్తం 1.65 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ డోసుల టీకాలను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది.

‘‘దేశవ్యాప్తంగా 5 వేల కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు పెట్టాలని ఏర్పాట్లు చేశాం. ముందుగా ఖరారు చేసిన కేంద్రాల సంఖ్యను తగ్గించాం. ఈనెల 16న 2,934 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తాం. దేశ రాజధాని దిల్లీలో 89 కేంద్రాలకు బదులు 75 కేంద్రాల్లోనే టీకాలు ఇస్తాం. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి, 1.65కోట్ల డోసుల కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లను సరఫరా చేశాం. ఏ రాష్ట్రమూ తమకు వ్యాక్సిన్‌ను కేటాయించలేదన్న ప్రశ్నలకు తావులేదు. ప్రాథమిక దశలోనే భారీగా వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశాం’’

‘‘రాబోయే వారాల్లో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం సరఫరా చేసిన వ్యాక్సిన్‌ డోసులలో 10శాతం రిజర్వ్‌/వృథాతో పాటు, ఒకరోజులో కేవలం 100 వ్యాక్సినేషన్‌ సెషన్‌ మాత్రమే జరిగేలా చూడాలని సూచించాం. ఒకరోజులో నిర్దేశించిన సంఖ్యకు మించి వ్యాక్సిన్‌ ఇవ్వకూడదని రాష్ట్రాలకు స్పష్టంగా తెలియజేశాం. దశలవారీగా వ్యాక్సిన్‌ సెషన్‌లను పెంచాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపాం’’ అని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.

ఇదీ చదవండి..!

టీకా వచ్చేసింది


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని