చంద్రబాబుపై కేసును ఖండిస్తున్నా: రామకృష్ణ - cpi ramakrishna response on chandrababu case
close
Published : 09/05/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబుపై కేసును ఖండిస్తున్నా: రామకృష్ణ

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు పెట్టడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం కక్ష సాధింపేనని ఆయన అన్నారు.  ఆయనపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తిపట్ల ప్రజలను అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా కారణంగా సంభవించిన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కేవలం మోదీ ప్రశంసలను పొందేందుకే ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌పై సీఎం జగన్‌ స్పందించారని  రామకృష్ణ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్‌440కె అనే కొత్త రకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందుతోందంటూ చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తామని కర్నూలు ఎస్పీ ఫకీరప్ప వెల్లడించిన విషయం తెలిసిందే. కొత్తరకం వైరస్‌పై చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు అందిందని, దీనిపై శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టుపై ఇన్వెస్టిగేషన్‌ అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని