సీతారాం ఏచూరికి మాతృ వియోగం - cpm general secretary sitaram yechurys mother kalpakam yechury has passed away
close
Published : 25/09/2021 21:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీతారాం ఏచూరికి మాతృ వియోగం

దిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం ఏచూరి (88) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్యంతో నెలకొన్న అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. చిన్నతనం నుంచే ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌కు అభిమానే కాక.. ఆమె బాటను కల్పకం తన జీవితాంతం అనుసరించారు. ఆమె మృతికి సీపీఎం సంతాపం ప్రకటించింది. ఆమె పార్థివ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు ఆ పార్టీ తెలిపింది. కల్పకం మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి ఏప్రిల్‌లో కొవిడ్‌తో కన్నుమూశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని