Sonusood: హర్భజన్‌కు సోనూ సాయం - cricker harbhajan thanked sonusood
close
Published : 13/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonusood: హర్భజన్‌కు సోనూ సాయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌.. ఇప్పుడు ఎవరికీ ఏ అవసరం వచ్చినా గుర్తొస్తున్న పేరు. సామాన్య ప్రజలే కాదు.. సెలెబ్రిటీలు కూడా ఆపద రాగానే సోనూను తలచుకుంటున్నారు. సోనూసూద్‌ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన టీమ్‌తో కలిసి సాధ్యమైనంత వరకూ సహాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆ లిస్టులో భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ చేరాడు. కర్ణాటకలో తనకు కావాల్సిన వ్యక్తికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలంటూ భజ్జీ చేసిన ట్వీట్‌కు సోనూ స్పందించాడు. అంతేకాదు.. అంతే వేగంగా ఆ ఇంజక్షన్లు అందజేశాడు. దీంతో సోనూ చేసిన సాయానికి భజ్జీ కృతజ్ఞతగా స్పందిస్తూ.. ‘కృతజ్ఞతలు సోదరా.. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’ అని ట్వీట్‌ చేశాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని