కరోనా బాధితులకు పఠాన్‌ సోదరుల సాయం  - cricket academy pathans provide free meals to covid 19 hit people in delhi
close
Published : 06/05/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా బాధితులకు పఠాన్‌ సోదరుల సాయం 


 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం 4 లక్షల మంది వైరస్‌ బారినపడుతున్నారు. ప్రస్తుతం దేశం వైద్యసేవల పరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా బాధితులకు సరైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా క్రీడాలోకం సైతం ముందుకు వస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్‌, సచిన్ తెందూల్కర్, జయదేవ్ ఉనద్కత్, బ్రెట్‌ లీ, శిఖర్‌ ధావన్‌ లాంటి ఆటగాళ్లు తమకు తోచిన విధంగా సాయం చేశారు. తాజాగా ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్‌, యూసుఫ్ పఠాన్‌లు కూడా చేరారు. ఈ సందర్భంగా 
‘‘దేశం కరోనా రెండో దశ  కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలకు సాయం చేయడం మా బాధ్యత. దక్షిణ దిల్లీలోని కరోనా బాధితులకు క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్‌ తరఫున ఉచితంగా ఆహారం అందిస్తాం’’ అని బుధవారం ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని