కొవిడ్‌ వార్డుల్లో పడకల సంఖ్య పెంచాలి - cs review meeting on covid situation
close
Published : 04/05/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వార్డుల్లో పడకల సంఖ్య పెంచాలి

హైదరాబాద్‌: కొవిడ్ నియంత్రణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఐఎఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు,  ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో బీఆర్కే భవన్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారిని అధిగమించడానికి  అధికారులందరూ అంకిత భావంతో పనిచేయాలని సీఎస్‌ ఆదేశించారు. 

మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కూడిన బృందాలను ప్రతి ఇంటికి పంపించాలని.. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి, మెడికల్ కిట్లను అందజేయాలన్నారు. అన్ని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, ఇతర ఆరోగ్య కేంద్రాలలో కొవిడ్ అవుట్ పేషెంట్ క్లినిక్‌లను నిర్వహించాలన్నారు. నిమ్స్, సరోజినిదేవి, ఛాతీ, గాంధీ, ఫీవర్, టిమ్స్, కింగ్ కోఠి, మలక్‌పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండపూర్ ఏరియా ఆసుపత్రుల్లోని కొవిడ్‌ వార్డుల్లో పడకల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని