IPL : సరికొత్తగా ధోనీసేన! - csk has new energy this time says sunil gavaskar
close
Published : 16/05/2021 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL : సరికొత్తగా ధోనీసేన!

సన్నీ గావస్కర్‌ ప్రశంసలు

ముంబయి: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ సరికొత్త ఉత్సాహంతో కనిపించిందని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎంతో పుంజుకుందని పేర్కొన్నారు. మొయిన్‌ అలీని మూడో స్థానంలో దించి ఫలితాలు రాబట్టిందని ప్రశంసించారు. ఇతర ఆటగాళ్లూ మంచి ఫామ్‌లో కనిపించారని వెల్లడించారు.

నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ సీజన్లో సీఎస్‌కే అదరగొట్టింది. 7 మ్యాచుల్లో 5 గెలిచి 10 పాయింట్లు సాధించింది. పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ బ్యాటింగ్‌తో ప్రభావం చూపకపోయినా తన అనుభవం, సారథ్యంతో ఫలితాలు రాబట్టాడు. చక్కని వ్యూహాలు రచించాడు. రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మొయిన్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. డుప్లెసిస్‌, జడ్డూ సైతం అదరగొట్టారు.

‘గతేడాది చెన్నై నిరాశపరిచింది. తాజా సీజన్లో ఎప్పటిలాగే ఛాంపియన్‌లా ఆడింది. ఆ జట్టులో పెద్దగా మార్పులేమీ లేనప్పటికీ ఈ సారి సరికొత్త ఉత్సాహం కనిపించింది. మొయిన్‌ అలీని మూడో స్థానంలో ఆడించడం తిరుగులేని ఫలితాలు ఇచ్చింది. అతడు కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. డుప్లెసిస్‌ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ కనీస ప్రదర్శన చేశాడు. వీరంతా జట్టుకు శుభారంభాలు అందించారు’ అని సన్నీ తెలిపారు.

‘సామ్‌ కరన్‌ ఆకట్టుకొన్నాడు. మ్యాచు మ్యాచుకు మరింత మెరుగయ్యాడు. చక్కని ఆల్‌రౌండర్‌గా ముద్రవేశాడు. ఆఖరి ఓవర్లు వేయడంలో మాత్రం సీఎస్‌కే మరింత మెరుగువ్వాలి. ముంబయిపై 218 పరుగులు చేసినా ఆఖరి బంతికి విజయం చేజారింది’ అని సన్నీ పేర్కొన్నారు. కాగా ధోనీసేనను ఐపీఎల్‌లో కరోనా వెంటాడిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని