సీటీస్కాన్‌ రూ.3వేలు మించకూడదు - ct scan fee shouldnot exceeds rs3000
close
Published : 26/04/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీటీస్కాన్‌ రూ.3వేలు మించకూడదు

స్పష్టం చేసిన మంత్రి ఆళ్లనాని

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య పరీక్షల సంఖ్య పెరుగుతుండటంతో వాటి ధరలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీటీస్కాన్‌ ధర రూ.3వేలకు మించకూడదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. అధిక ఫీజులు తీసుకునే స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టామన్నారు. అంతేకాకుండా ఫిర్యాదులు వచ్చే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం హెచ్చరించినా.. తప్పులు చేసే ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండేవారికి నిత్యం సేవలు అందించాలని కోరారు.

మరోవైపు కొవిడ్‌ చికిత్స పూర్తయినా రోగులను డిశ్చార్జ్‌ చేయని కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నోటీసులు జారీ చేసింది. చికిత్స పూర్తి చేసుకున్నప్పటికీ 10-14 రోజుల పాటు  రోగులను ఉంచేసి ఆరోగ్యశ్రీ ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని