కర్ఫ్యూతో సమస్య లేదు:బీసీసీఐ - curfew wont hurt ipl travel: bcci
close
Published : 05/04/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్ఫ్యూతో సమస్య లేదు:బీసీసీఐ

ముంబయి: కొవిడ్‌ విజృంభణ ధాటికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 5 నుంచి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరికి మదిలో మెదిలే ప్రశ్న ఐపీఎల్‌-2021. మహమ్మారి విలయతాండవంలో లీగ్‌ నిర్వహణ సాధ్యమేనా? రాత్రుళ్లు కర్ఫ్యూ ఉంటే ఆటగాళ్లు హోటళ్ల నుంచి స్టేడియానికి, స్టేడియం నుంచి హోటళ్లకి ఎలా వస్తారు? అనే సందేహాలపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. ఆటగాళ్లంతా బయో బబుల్‌లోనే ఉంటున్నందున కర్ఫ్యూ ప్రభావం లీగ్‌పై పెద్దగా ఉండదని పేర్కొంది.

‘‘ జట్టుల్లోని ప్రతిఒక్క ఆటగాడితో పాటు వారి ప్రయాణ బస్సులు, డ్రైవర్లు, సిబ్బంది అంత బయోబబుల్లోనే ఉంటున్నారు. కాబట్టి మ్యాచ్‌ రోజుల్లో హోటల్‌ నుంచి స్టేడియానికి వెళ్లడంలో ఎటువంటి సమస్య రాదు. సాధారణ పరీక్షలు ప్రతిఒక్కరికీ పూర్తయ్యాయి. గతేడాది యూఏఈలో నిర్వహించిన మాదిరే ఈ సారి కూడా లీగ్‌ను కట్టుదిట్టంగా నిర్వహిస్తాం’’ అని బీసీసీఐ తెలిపింది.

మరోవైపు క్రీడకారులందరికీ టీకా పంపిణీ చేసేందుకు బోర్డు కేంద్ర ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతోందని బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైరస్‌ కట్టడికి టీకా ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని