Daare Leda: ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బహుమతిగా..! - daare leda music video song
close
Published : 18/06/2021 23:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Daare Leda: ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బహుమతిగా..!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కొవిడ్ వేళ అనేక మంది ప్రాణాల్ని ర‌క్షిస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకి బ‌హుమ‌తిగా ‘దారే లేదా..’ అనే వీడియో గీతాన్ని యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. విజ‌య్ బుల్గానిన్‌ స్వరాలు స‌మ‌కూర్చిన‌ ఈ పాట‌కు కె.కె. సాహిత్యం అందించారు. న‌టులు సత్యదేవ్‌‌, రూప ఈ గీతంలో కనిపించారు.

వృత్తి రీత్యా సత్యదేవ్‌, రూప‌ వైద్యులు కావ‌డంతో ఉద‌యం వేళ కార్తిక్‌(సత్యదేవ్‌‌), రాత్రి విధుల్లో శృతి(రూప‌) కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. ఇలా వైద్యులు తమ‌ వృత్తికోసం, కొవిడ్‌ బాధితుల ప్రాణాలను రక్షించడం కోసం ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో, ఎంత రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని ఈ పాటలో చాలా ఎమోషన‌ల్‌గా చూపించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలైన ఈ పాట అంద‌రినీ ఆలోచింపజేస్తోంది.

కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాల‌తో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి, కొవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలందించి, ఎంతోమంది ప్రజల జీవితాలను కాపాడిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ఈ పాటను అంకితమిచ్చారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని ఈ మ్యూజిక్‌ వీడియోను సమర్పించగా, చాయ్‌ బిస్కెట్‌ ఈ పాటను ఎగ్జిక్యూట్‌ చేసింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని