దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాల ప్రదానోత్సవం - dadasaheb phalke awards akshay kumar and sushant singh rajput
close
Published : 21/02/2021 23:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాల ప్రదానోత్సవం

ముంబయి: సినిమా ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాలు ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నటీనటులను సత్కరించేందుకు ముంబయిలో ఫిబ్రవరి 20న దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వహించారు. కాగా.. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులను అవార్డులు వరించాయి. సుశాంత్‌సింగ్‌, అక్షయ్ కుమార్, సుష్మితా సేన్, కియారా అడ్వాణీ వేర్వేరు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్నారు.

గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డ యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ను ‘విమర్శకుడు మెచ్చిన నటుడి’గా జ్యూరీ ప్రకటించింది. సుశాంత్ చివరిసారిగా 2019లో వచ్చిన ‘చిచోరే’ చిత్రంలో కనిపించాడు. ఆ చిత్రాన్ని నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ‘ఛపాక్‌’ చిత్రంలో నటనకు గానూ దీపిక పదుకొణె ఉత్తమ నటిగా పురస్కారం సొంతం చేసుకుంది. అక్షయ్‌కుమార్‌ ‘లక్ష్మీబాంబ్‌’తో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. కియారా అడ్వాణీ ‘గిల్టీ’ చిత్రంతో ‘విమర్శకులు ఎంచుకున్న ఉత్తమ నటి’ విభాగంలో పురస్కారం సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా తానాజీ (ది అన్‌సంగ్‌ వారియర్‌) నిలిచింది. ఉత్తమ దర్శకుడు : అనురాగ్‌ బసు (లుడో). ఉత్తమ సిరీస్‌ : స్కామ్‌ 1992, ఉత్తమ వెబ్‌సిరీస్‌ నటిగా సుష్మితాసేన్‌ (ఆర్య)ను పురస్కారాలు వరించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని