అది భరతమాత గుండెలో కత్తి దింపడమే..! - dagger in mother indias heart: rahul gandhi on centres vaccine policy
close
Updated : 01/06/2021 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది భరతమాత గుండెలో కత్తి దింపడమే..!

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై రాహుల్‌ విమర్శలు

దిల్లీ: కొవిడ్‌ కట్టడిలో భాగంగా కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చూస్తే భరతమాత గుండెలో కత్తి దింపినట్లుగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ట్విటర్‌ వేదికగా సోమవారం ఆయన పలు ఆరోపణలు చేశారు. దేశంలో ఈ ఏడాది మే నెలలో నిరుద్యోగిత శాతం రెండంకెలుగా నమోదైనట్లు మీడియా నివేదికలను చూపుతూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. దురహంకారపూరితమైన ఓ వ్యక్తి.. రూపాంతరం చెందుతున్న వైరస్‌.. కారణంగానే దేశంలో 97 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారని వేరొక ట్వీట్‌లో రాశారు. అయితే మోదీ వ్యతిరేక ప్రచారంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై  కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందంటూ భాజపా ఆరోపించింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు టీకా ఉత్పత్తి సంస్థల నుంచి తమ కోటా వ్యాక్సిన్లను సైతం తీసుకోలేకపోతున్నాయని విమర్శించింది. ఆ రాష్ట్రాలపై ఆయన దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని