Today Horoscope: ఈ రోజు రాశి ఫలం - daily horoscope for 1-07-21
close
Updated : 01/08/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం. 

మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ముఖ్య వ్యవహారాల్లో నిదానంగా మాట్లాడాలి. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

చేపట్టే పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. తోటివారి సహకారం అందుతుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. కొత్త పనులు చేపడతారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం అవుతాయి. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికం అవుతుంది. ఆపదలు పెరగకుండా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి ఉండకపోవచ్చు. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. శ్రీలక్ష్మీ  సహస్రనామం పఠించడం మంచిది.

కాలం సహకరిస్తోంది. మీ మీ రంగాల్లో శుభఫలితాలను పొందుతారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.

కొద్దిపాటి ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అభివృద్ధికి  సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిశ్రమ కాలం. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.

కష్టానికి తగిన ఫలితాలు సొంతం అవుతాయి. నూతన కార్యక్రమాలను  ప్రారంభించే ముందు లాభ నష్టాలను అంచనా వేసి ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శివపార్వతుల  సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

శుభకాలం. ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.

మీ మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక వ్యవహారంలో  అధికారుల మన్ననలను అందుకుంటారు. ప్రయాణ సౌఖ్యం కలదు. ఈశ్వర ఆరాధన చేస్తే మంచిది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని