Today Horoscope: ఈ రోజు రాశి ఫలం - daily horoscope for 31-07-2021
close
Published : 31/07/2021 06:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ నైపుణ్యంతో గొప్ప పేరు సంపాదిస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్థలాభం ఉంది. ఈశ్వర దర్శనం మంచిది.

శారీరక శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి . అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కుటుంబ సహకారం ఉంటుంది. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.

వృత్తి,ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. భయాందోళనలు విడనాడాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మిశ్రమకాలం. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దేహజాఢ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ్‌ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి ఉంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని ఇస్తుంది.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచి చేస్తుంది.

శారీరక సౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఇష్టదైవాన్ని పూజించాలి. 

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని