పీసీబీని బెదిరించి తిరిగి రావాలని చూస్తున్నాడు.. - danish kaneria says mohammad amir is trying to blakmail pakistan cricket board to come back into action
close
Published : 17/05/2021 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీసీబీని బెదిరించి తిరిగి రావాలని చూస్తున్నాడు..

మహ్మద్ అమిర్‌పై కనేరియా వ్యాఖ్యలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ జట్టులోకి తిరిగి రావడానికి మహ్మద్‌ అమిర్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డును బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆ జట్టు మాజీ లెగ్‌స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. అమిర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ జట్టులో తనకు తగిన గుర్తింపు దొరకడం లేదని, దాంతో ఆటకు ముగింపు పలకాలని కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఆ విషయం తన యూట్యూబ్‌ ఛానెల్లో స్పందించిన కనేరియా.. అమిర్‌పై నిప్పులు చెరిగాడు. ‘అతడి నుంచి నేనేమీ తీసుకోదల్చుకోలేదు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తపర్చవచ్చు. అమిర్‌ తన వ్యాఖ్యలతో ఇతరులను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తద్వారా తిరిగి జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ఇంతకుముందు ‘‘ఇంగ్లాండ్‌కు వెళ్లి పౌరసత్వం తెచ్చుకొని అక్కడి నుంచి ఐపీఎల్‌లో ఆడతా’’నని అతడు చేసిన వ్యాఖ్యలను బట్టి తలపొగరు అర్థం చేసుకోవచ్చు’ అని కనేరియా అన్నాడు.

‘స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో నిషేధానికి గురైన తర్వాత పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అమిర్‌ను తిరిగి జట్టులోకి తీసుకురాడానికి ఆసక్తి చూపించిందనే విషయాన్ని గుర్తించాలి. కానీ, ఏడాదిన్నరగా అతడి ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అమిర్‌ మంచి ప్రదర్శన చేశాడనే విషయాన్ని ఒప్పుకుంటా. కానీ, ఆ తర్వాతే అతడి ప్రదర్శన అంతకంతకూ దిగజారిపోయింది. ఈ క్రమంలోనే జట్టు నుంచి దూరం చేశాక.. ఆ పీసీబీ యాజమాన్యం ఉన్నంతవరకు ఆడనని చెప్పావు. వాళ్లే నిన్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారనే విషయాన్ని మర్చిపోయావు. ఈ విషయంలో మిస్బాఉల్‌ హక్‌, మహ్మద్ హఫీజ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. బోర్డు వారిపై ఒత్తిడి తెచ్చి అమిర్‌కు అండగా ఉండి, తిరిగి జట్టులోకి తీసుకోవాలని చూసింది. అప్పుడు కొంత మంది వ్యాఖ్యాతలు కూడా అమిర్‌కు మద్దతు ఇవ్వాలనుకోలేదు. కానీ అలా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వారికి కామెంట్రీనే జీవనాధారం’ అని మాజీ లెగ్‌స్పిన్నర్‌ తన అభిప్రాయాలను బలంగా వినిపించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని