అభిమానుల కోరిక మేరకే రజనీ‌లా: వార్నర్‌ - david warner as rajinikanth viral video
close
Published : 01/01/2021 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానుల కోరిక మేరకే రజనీ‌లా: వార్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆటతోనే కాదు, తన స్టెప్పులు, హాస్య చతురతతో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ అభిమానులను తరచూ అలరిస్తుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో టాలీవుడ్‌ హిట్‌ పాటలను టిక్‌టాక్ చేసి నెటిజన్లను ఎంతగానో అలరించాడు. తాజాగా ఫేస్‌ యాప్‌తో వినూత్న వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాడు. మహర్షిలో మహేశ్‌ బాబు‌‌, అరవింద సమేతలో ఎన్టీఆర్‌, అంతేగాక మైదానంలో విరాట్ కోహ్లీలా కనిపిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడు.

తాజాగా వార్నర్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అవతారమెత్తాడు. రజనీ స్థానంలో తాను కనిపిస్తూ దర్బార్‌ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. తనను ఎంతో మంది రజనీలా వీడియో చేయమని కోరుతుండటంతో ఇలా పోస్ట్ చేశానని పేర్కొన్నారు. అలాగే తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వార్నర్‌  పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 15లక్షల మందికి పైగా వీడియోను వీక్షించారు. కాగా, గాయంతో జట్టుకు దూరమైన వార్నర్‌ మూడో టెస్టులో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సిడ్నీ వేదికగా జనవరి 7న భారత్‌, ఆసీస్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

నన్ను ‘గెట్ లాస్ట్‌’ అన్నారు: గావస్కర్

టెస్టుల్లో నట్టూ.. వైస్‌కెప్టెన్‌గా రోహిత్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని