ఓటమికి పూర్తి బాధ్యత నాదే: వార్నర్‌ - david warner takes responsibility of the srh defeat in csk match
close
Published : 30/04/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటమికి పూర్తి బాధ్యత నాదే: వార్నర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై మళ్లీ అదరగొట్టింది. బుధవారం దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 7 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57; 55 బంతుల్లో 3×4,, 2×6) అర్ధశతకం సాధించాడు. కానీ, తనదైన శైలిలో దూకుడుగా ఆడలేకపోయాడు. మనీశ్ పాండే (61;  46 బంతుల్లో 5×4, 1×6) కాస్త వేగంగా ఆడాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేన్‌ విలియమ్సన్‌ (26; 10 బంతుల్లో 4×4, 1×6), కేదార్ జాదవ్‌ (12; 4 బంతుల్లో 1×4, 1×6) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్‌ 170 పరుగులు దాటింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75; 44 బంతుల్లో 12 ఫోర్లు), డుప్లెసిస్ (56; 38 బంతుల్లో 6×4, 1×6) అర్ధసెంచరీలు బాదడంతో చెన్నై విజయం వైపు దూసుకెళ్లింది. వీరిద్దరూ ఔటైన తర్వాత జడేజా, సురేశ్‌ రైనా మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో సన్‌రైజర్స్‌ ఐదో ఓటమిని నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోవడానికి తాను నెమ్మదిగా బ్యాటింగ్ చేయడమే కారణమని ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ అన్నాడు. ‘‘నేను బ్యాటింగ్ చేసిన విధానానికి పూర్తి బాధ్యత తీసుకుంటాను. నెమ్మదిగా బ్యాటింగ్ చేశా. మనీశ్ పాండే అద్భుతంగా ఆడాడు. కేన్ విలియమ్సన్‌, కేదార్ జాదవ్ చివర్లో ధాటిగా ఆడి గౌరవప్రదమైన స్కోరునందించారు. కానీ, ఈ రోజు ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా’’ అని మ్యాచ్‌ ముగిసిన అనంతరం వార్నర్ పేర్కొన్నాడు. 

‘‘ఇంకో 20-30 పరుగులు చేసి ఉంటే మాకు విజయావకాశాలు ఉండేవి. మేం చాలా బంతులను వృథా చేశాం. అయినా, చివరి దాకా పోరాడాం. చెన్నై ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. 
ఈ రోజు మేం మంచి ప్రదర్శనే ఇచ్చామని అనుకుంటున్నా. 170 పరుగులు చేయడం సానుకూలమైన అంశం. మాది పోరాటయోధుల బృందం. ఈ మ్యాచ్‌ ఫలితం మా కుర్రాళ్లను నిరాశకు గురిచేసింది. కానీ, మేం మళ్లీ పైకి వెళతాం’’ అని వార్నర్‌ ముగించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని