మానవత్వాన్ని చంపేసిన కరోనా! - dead body shifted in garbage vehicle
close
Published : 11/04/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మానవత్వాన్ని చంపేసిన కరోనా!

చెత్తబండిలో మృతదేహం తరలింపు

ధులే: కరోనా సృష్టిస్తున్న కల్లోలం మనుషుల్లో మానవతను సైతం చంపేస్తోంది. కరోనాతో మృతిచెందిన వ్యక్తిని శ్మశానానికి తీసుకువెళ్లేందుకు వాహనం కరవై.. చెత్తబండిలో తరలించాల్సి వచ్చింది. బాధిత కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని షక్రి తాలూకా సమోద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తి కరోనాతో శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. శ్మశానానికి తరలించేందుకు తొలుత అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే ఎంతకీ రాలేదు. తర్వాత ఏదోక వాహనం కోసం కుటుంబసభ్యులు రోజంతా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ విషయంలో పంచాయతీ సైతం చేతులెత్తేసింది. చివరికి  గ్రామంలో చెత్త తరలించే బండిలోనే శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని