మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించండి - declare covid-19 pandemic as national calamity: maha cm to centre
close
Published : 29/04/2021 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించండి

కేంద్రాన్ని కోరిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: కొవిడ్‌-19 మహమ్మారిని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా కేంద్రానికి రాసిన లేఖలో కొవిడ్‌-19 సంక్షోభాన్ని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని ఠాక్రే కోరినట్లు వెల్లడించారు. సుప్రీం, హైకోర్టులు కరోనా తీవ్రతను చూసి ఆందోళ చెందుతున్నాయని ఇలాంటి సందర్భంతో జాతీయ విపత్తు ప్రకటించడం దేశానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన తెలిపారు. ఈ విషయం గురించి ఠాక్రే నెల రోజుల నుంచి ప్రస్తావిస్తున్నారని, సుప్రీం కోర్టు కూడా దీని మీద దృష్టి పెట్టాలని రౌత్‌ అన్నారు. రాష్ట్రంలోని ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను గమనించి, దేశంలోని మిగతా చోట్ల అటువంటి చర్యలను అమలుచేయాలని పిలుపునిచ్చారు. కాగా.. బుధవారం రాష్ట్రంలో కొత్తగా 63,309 కరోనా వైరెస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,73,394కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 985 మరణాలు సంభవించాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని