కోలుకున్నా.. చాహర్‌ వీడియో సందేశం - deepak chahar recoroved well
close
Updated : 02/09/2020 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోలుకున్నా.. చాహర్‌ వీడియో సందేశం

త్వరలోనే బరిలోకి దిగుతానని యువ పేసర్ ధీమా

దుబాయ్‌: కొవిడ్‌-19 నుంచి తాను చక్కగా కోలుకున్నానని చెన్నై సూపర్‌కింగ్స్‌ యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. త్వరలోనే రంగంలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు. తన యోగక్షేమాలను కోరుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. దుబాయ్‌లోని హోటల్‌ గది నుంచి తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు.

దుబాయ్‌ చేరుకున్న తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ శిబిరంలో కరోనా కలకలం చెలరేగింది. ఇద్దరు క్రికెటర్లు సహా మొత్తం 13 మందికి వైరస్‌ సోకింది. పేసర్‌ దీపక్‌ చాహర్‌, యువ బ్యాట్స్‌మన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఉండటంతో అందరూ కలవర పడ్డారు. దాంతో ఆ శిబిరమంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఆ 13 మందిని మినహాయించి నిర్వహించిన పరీక్షల్లో మిగతా వారందరికీ నెగెటివ్‌ రావడం కాస్త సంతోషాన్నిచ్చింది.

‘కోలుకోవాలని కోరుకున్న, ప్రార్థనలు చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. నేను చక్కగా కోలుకున్నాను. త్వరలోనే బరికిలో దిగుతాను’ అని దీపక్‌ చాహర్‌ మాట్లాడిన వీడియోను సీఎస్‌కే ట్విటర్లో పోస్ట్‌ చేసింది. అందులో చాహర్‌ కాళ్లకు సంబంధించిన కసరత్తులు చేయడం గమనార్హం. అతడిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 జరుగుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని