ఐపీఎల్‌ జరగ వద్దన్నది శశాంక్‌ కుతంత్రం! - delay tactics are shashanks he doesnt want to happen ipl
close
Published : 25/07/2020 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌ జరగ వద్దన్నది శశాంక్‌ కుతంత్రం!

ప్రపంచకప్‌ వాయిదాకు బీసీసీఐ ఒత్తిడి చేయలేదన్న పాక్‌ మాజీ క్రికెటర్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్‌ను వాయిదా వేయగానే అందరూ ఏమనుకున్నారు? తన ప్రయోజనాలు కాపాడుకొనేందుకు, ఐపీఎల్‌ను నిర్వహించేందుకే బీసీసీఐ ఇలా ఒత్తిడి చేసిందని అనుకున్నారు. అయితే ఇదంతా నిజం కాదని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ అన్నాడు. ఐసీసీ అంతర్గత సమావేశాల్లో బీసీసీఐ అసలు అలా చేయలేదని శశాంక్‌ మనోహరే కుట్ర పూరితంగా వ్యవహరించాడని తన యూట్యూబ్‌ ఛానల్లో చెప్పాడు.

‘వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 1 లేదా 1.5 నెలల ముందుగానే ప్రకటించాల్సింది. ఉద్దేశపూర్వకంగానే శశాంక్‌ మనోహర్‌ (ఐసీసీ మాజీ ఛైర్మన్‌) ఆలస్యం చేశాడు. భారత అభిమానులు బాధపడొచ్చు. కానీ ఆయన మాత్రం ఐపీఎల్‌ జరగొద్దని కోరుకున్నాడు. నా అభిప్రాయమైతే ఇదే. గతంలోనూ ఇదే చెప్పాను. నిర్ణయం వాయిదా వ్యూహాలన్నీ ఆయనవే’ అని బాసిత్‌ అలీ అన్నాడు.

‘ఐపీఎల్‌ నిర్వహణ కోసం ఆసియాకప్‌, ప్రపంచకప్‌ జరగకుండా బీసీసీఐ ఒత్తిడి చేసిందని సోషల్‌ మీడియా, వార్తా ఛానళ్లలో వచ్చింది. నాకూ కాల్స్‌ వచ్చాయి. నిజానికి ఐసీసీ సమావేశాల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలియదు. టీ20 ప్రపంచకప్‌ జరగదని అందరికీ తెలుసు. ఎందుకంటే నిర్వహణకు ఆస్ట్రేలియా తిరస్కరించింది. మరో విషయం ఏంటంటే పీసీబీకి బీసీసీఐ మద్దతు ప్రకటించింది. ప్రపంచకప్‌ను ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించేందుకు అంగీకరించలేదు. ముందే నిర్ణయించిన పీఎస్‌ఎల్‌ టోర్నీని ఎందుకు రద్దు చేసుకోవాలని ప్రశ్నించింది. ఈసీబీ సైతం మద్దతు ఇచ్చింది. దాంతో టీ20 మెగాటోర్నీ నవంబర్‌కు వాయిదా పడింది’ అని బాసిత్‌ పేర్కొన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని