Rishabh Pant: పంత్‌ది ‘లగాన్‌’ వారసత్వమే మరి! - delhi capitals hilarious lagaan meme features rishabh pant
close
Published : 16/06/2021 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rishabh Pant: పంత్‌ది ‘లగాన్‌’ వారసత్వమే మరి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్‌ చేసిన ఓ ట్వీట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘లగాన్’ చిత్రంలో జ్యోతిష్కుడు పాత్రధారితో రిషభ్ పంత్‌ను పోల్చడమే అందులో విశేషం. ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన ఈ చిత్రం విడుదలై 20 వసంతాలు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దిల్లీ ఓ మీమ్‌ను పోస్ట్‌ చేసింది.

ఆ సినిమాలో బ్యాటింగ్‌ ఎలా చేయాలో తెలియక ఓ జ్యోతిష్కుడు వికెట్లకు ఎదురుగా నిలబడతాడు. గార్డ్‌ తీసుకోడు! బంతి ఎటువైపొచ్చిన కొట్టేలా కనిపిస్తాడు. జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌ ఈ మధ్యే రివర్స్‌స్వీప్‌లో భారీ షాట్‌ ఆడిన సంగతి గుర్తుంది కదా! ఆ రెండు చిత్రాలతో కలిపి డీసీ ఆ మీమ్‌ను రూపొందించింది. ‘లగాన్‌కు 20 ఏళ్లు. ఆ గొప్ప వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది’ అని వ్యాఖ్య పెట్టింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో దిల్లీకి ఈ సీజన్లో పంత్‌ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. లీగ్‌ వాయిదా పడటంతో కొన్నాళ్లు ఇంట్లో గడిపిన అతడు తిరిగి టీమ్‌ఇండియాలో చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు. రహానె, కోహ్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచులో అతడు శతకం బాదేసి ఊపుమీద కనిపించాడు. ఇదే ప్రదర్శనను కివీస్‌పై చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్లోనే కాకుండా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసులో పంత్‌ కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని