రాణించిన పృథ్వీ.. హైదరాబాద్‌ లక్ష్యం 160 - delhi capitals posted a normal score infront of sunrisers hyderabad
close
Updated : 29/04/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాణించిన పృథ్వీ.. హైదరాబాద్‌ లక్ష్యం 160

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(53; 39 బంతుల్లో 7x4, 1x6), శిఖర్‌ ధావన్‌(28; 26బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రషీద్‌ఖాన్‌ విడదీశాడు. 11వ ఓవర్‌లో ధావన్‌ను బౌల్డ్‌ చేసి సన్‌రైజర్స్‌కు ఊరటనిచ్చాడు. తర్వాతి ఓవర్‌లోనే అర్ధశతకంతో దూసుకుపోతున్న పృథ్వీ రనౌటయ్యాడు. దాంతో దిల్లీ 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆపై జోడీ కట్టిన రిషభ్‌ పంత్‌(37; 27 బంతుల్లో 4x4, 1x6), స్మిత్‌(34; 25 బంతుల్లో 3x4, 1x6) రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, సిద్ధ్‌ర్థ్‌కౌల్‌ వేసిన 19వ ఓవర్‌లో పంత్‌, హెట్మేయర్‌(2) పెవిలియన్‌ చేరారు. ఆఖరి ఓవర్‌లో స్మిత్‌ ధాటిగా ఆడి 14 పరుగులు రాబట్టాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సిద్ధ్‌ర్థ్‌ రెండు, రషీద్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని