టాప్‌లోకి దిల్లీ క్యాపిటల్స్‌ - delhi capitals won the match and came top in points table
close
Updated : 02/05/2021 23:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌లోకి దిల్లీ క్యాపిటల్స్‌

పంజాబ్‌పై ఘన విజయం..

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో ఛేదించింది. దాంతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి చేరింది. ఓపెనర్లు పృథ్వీషా(39; 22 బంతుల్లో 3x4, 3x6), శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్‌; 47 బంతుల్లో 6x4, 2x6) మరోసారి శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే పృథ్వీ ధాటిగా ఆడుతూ హర్‌ప్రీత్‌ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికి బౌల్డయ్యాడు. ఆపై ధావన్‌, స్టీవ్‌స్మిత్‌(24; 22 బంతుల్లో 1x4) నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించారు. అయితే, మెరిడిత్‌ వేసిన 13వ ఓవర్‌ చివరి బంతికి స్మిత్‌ భారీ షాట్‌ ఆడబోయి మలన్‌ చేతికి చిక్కాడు. దాంతో దిల్లీ 111 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం పంత్‌(14; 11 బంతుల్లో 1x4, 1x6), ధావన్‌ మరింత ధాటిగా ఆడారు. అయితే జట్టు విజయానికి 20 పరుగుల దూరంలో ఉండగా పంత్‌ ఔటయ్యాడు. చివర్లో షిమ్రన్‌ హెట్మేయర్‌(16 నాటౌట్‌; 4 బంతుల్లో 1x4, 2x6) దంచికొట్టడంతో దిల్లీ త్వరగానే విజయాన్ని అందుకుంది. పంజాబ్‌ బౌలర్లలో మెరిడిత్‌, జోర్డాన్‌, హర్‌ప్రీత్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(99 నాటౌట్; 58 బంతుల్లో 8x4, 4x6) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్‌ మలన్‌(26; 26 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ ప్రభ్‌ సిమ్రన్‌(12), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌(13)తో సహా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ దీపక్‌ హుడా(1), షారుఖ్‌ఖాన్‌(4), క్రిస్‌ జోర్డాన్‌(2) పూర్తిగా విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి వీరిని కట్టడి చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవడంతో మయాంక్‌ పగ్గాలు అందుకున్నాడు. దిల్లీ బౌలర్లలో రబాడ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని