మూడోదశకు సన్నద్ధత .. 5వేల మందికి శిక్షణ! - delhi govt to train 5000 youths as health assistants
close
Updated : 16/06/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడోదశకు సన్నద్ధత .. 5వేల మందికి శిక్షణ!

దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అదుపులోకి వస్తున్న తరుణంలో మూడో ముప్పు పొంచి ఉందన్న  హెచ్చరికలతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కష్ట కాలంలో వైద్యులకు సహాయపడేందుకు వీలుగా 5000 మంది యువకులకు హెల్త్‌ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం వెల్లడించారు. కరోనా రెండు దశల్లోనూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది కొరత కనబడిందని, అందువల్ల వైద్యులు/ నర్సులకు సహాయపడేందుకు 5వేల మంది సహాయకులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వీరందరికీ దిల్లీలోని తొమ్మిది ప్రముఖ వైద్య సంస్థల్లో రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

‘‘అందరికీ నర్సింగ్‌, పారామెడికల్‌‌, లైఫ్‌ సేవింగ్‌పై ప్రాథమికంగా శిక్షణ కల్పిస్తాం. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్‌ 28 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో పాటు 18 ఏళ్లు నిండిన ఎవరైనా అర్హులే’’ అని తెలిపారు. వీరు పనిచేసిన రోజులను బట్టి వేతనం చెల్లింపు ఉంటుందని సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని