ఆ చట్టం కింద దిల్లీలో ఎవరినైనా అరెస్టు చేయొచ్చు..! - delhi police can now apprehend anyone under national security act till october 18
close
Published : 24/07/2021 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ చట్టం కింద దిల్లీలో ఎవరినైనా అరెస్టు చేయొచ్చు..!

దిల్లీ: ఇకపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద దిల్లీలో పోలీసులు ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. ఈ మేరకు అక్కడ పోలీసులకు అదనపు అధికారాలిస్తూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అక్టోబరు 18 వరకు అమలులో ఉండనున్నట్టు తెలిపారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్పవం లాంటి పలు ముఖ్యమైన రోజులకు ముందు ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలివ్వడం సాధారణమేనని పలువురు సీనియర్‌ అధికారులు చెప్పుకొచ్చారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకాలపాలకు పాల్పడుతున్నట్లు అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఏ వ్యక్తినైనా ఎన్‌ఎస్‌ఏ కింద  అరెస్టు చేసే అధికారం తమకు ఉంటుందని సీనియర్‌ పోలీసు అధికారి స్ఫష్టం చేశారు.

నూతన సాగు చట్టాల రద్దుకు డిమాండ్‌ చేస్తూ దిల్లీలో, నగర సరిహద్దుల్లో వందలాది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. జంతర్ మంతర్‌ వద్ద కిసాన్‌ సంసద్‌ పేరుతో రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు కొనసాగనుంది. అయితే ఇదే సమయంలో తాజా ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. 


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని