దిల్లీ పోలీసులకు రూ.25 వేలు జరిమానా..!  - delhi police fined rs 25000 by court for miserably failing to investigate 2020 delhi riots
close
Published : 14/07/2021 23:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ పోలీసులకు రూ.25 వేలు జరిమానా..! 

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఓ కోర్టు అక్కడి పోలీసులకు రూ.25 వేలు జరిమానా విధించింది. 2020, ఫిబ్రవరిలో  దిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసు దర్యాప్తులో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. ఈ కేసులో పోలీసులు చాలా సాధారణ, నిర్లక్ష్యపు ధోరణితో దర్యాప్తు చేపట్టారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మునుపటి ఉత్తర్వులను సవాలు చేస్తూ దిల్లీ పోలీసులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై చేపట్టిన విచారణ సందర్భంగా కోర్టు తాజా తీర్పు ఇచ్చింది.  అల్లర్ల సమయంలో గాయపడిన మహమ్మద్‌ నాసిర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరొక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోర్టు సూచించింది. జరిమానా సొమ్మును భజన్‌పురా పోలీస్‌ ఠాణా ఎస్‌హెచ్‌వో నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.

గతేడాది ఫిబ్రవరిలో దిల్లీలోని జఫ్రాబాద్‌లో చెలరేగిన అల్లర్లు.. నాలుగు రోజుల్లో ఈశాన్య ప్రాంతానికి విస్తరించాయి.  కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగాయి.  ఈ ఘటనలో 53 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 580 మంది గాయాలపాలయ్యారు. అయితే అల్లర్లను నియంత్రణలో విలమయ్యారంటూ పోలీసులపై విమర్శలు వచ్చాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని