COVID19: దిల్లీలో మరణ మృదంగం - delhi records 335 deaths
close
Published : 06/05/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

COVID19: దిల్లీలో మరణ మృదంగం

న్యూదిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని దిల్లీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 335మంది కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 78,780 కరోనా టెస్టులు చేయగా, 19,133మంది కరోనా బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 24.29శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 20,028మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దిల్లీలో కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్లో 21,839మంది పడకలు అందుబాటులోకి 20,117 పడకలు నిండాయి. 1,772 మాత్రమే ఖాళీ ఉన్నాయి. అలాగే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో 5525 పడకలకు 4824 ఖాళీలు, కొవిడ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో 206 పడకలకు 90 ఖాళీగా ఉన్నాయి. 50,562మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

ప్రధాని మోదీకి కేజ్రీవాల్‌ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. బుధవారం దిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినందుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రోజూ దిల్లీకి సరిపడే ఆక్సిజన్ సరఫరా అందించేలా చూడాలని ప్రధానికి విజ్ఞపి చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని