దిల్లీ, మహారాష్ట్రను కుదిపేస్తున్న కరోనా - delhi records over 25000 new covid-19 cases 161 deaths in a day
close
Published : 18/04/2021 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ, మహారాష్ట్రను కుదిపేస్తున్న కరోనా

న్యూదిల్లీ: దిల్లీ, మహారాష్ట్రలను కరోనా వైరస్‌ కుదిపేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఒక్క రోజే 25వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. శనివారం 24,375 కేసులు నమోదు కాగా, ఆదివారం ఆ సంఖ్య 25,462కు చేరింది. కరోనా కారణంగా ఆదివారం 161మంది మృత్యవాతపడ్డారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 29.4శాతంగా ఉంది. తాజా కేసులతో దిల్లీలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,53,460కి చేరింది. 12,121మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకూ 7.66లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి

మహారాష్ట్రలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 68,631 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే. తాజాగా కరోనాతో బాధపడుతూ 503మంది మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 60,473కు చేరింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని