టాస్ ‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ - delhi won the toss and elected to bat
close
Updated : 20/10/2020 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్ ‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: దుబాయ్‌ వేదికగా మరికాసేపట్లో పంజాబ్‌, దిల్లీ జట్లు తమ పదో మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దిల్లీ‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే దిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు పంజాబ్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి ప్లేఆఫ్స్‌కు చేరడం కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. గత మ్యాచ్‌లో ముంబయిపై రెండో సూపర్‌ ఓవర్‌లో గెలుపొందిన నేపథ్యంలో ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనబడుతోంది. దిల్లీపైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌పై విజయం సాధించడం పంజాబ్‌కు అంత తేలిక కాదు. ఒకవేళ ఓడితే మాత్రం ప్లేఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లుతాయి.


పంజాబ్‌ జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌గేల్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దీపక్‌ హూడా, జేమ్స్‌ నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, రవిబిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

దిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్(కెప్టెన్‌)‌, రిషభ్‌పంత్, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, డేనియల్‌ సామ్స్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, తుషార్‌ దేశ్‌పాండే, కగిసొ రబాడ.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని