కరోనాను తరిమేందుకు ‘దెయ్యాల నృత్యం’ - demon dance for corona end in venezuela
close
Updated : 05/06/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను తరిమేందుకు ‘దెయ్యాల నృత్యం’

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తున్న వేళ ఈ మహమ్మారి ప్రపంచాన్ని విడిచి పోవాలంటూ వెనెజులాలోని ఓ తెగ ప్రజలు దెయ్యాల నృత్యం చేశారు. వీరు క్యాథలిక్ సంప్రదాయ ప్రకారం చెడుపై మంచి విజయం సాధించిన రోజును గుర్తు చేసుకుంటూ 300 ఏళ్లుగా ఓ ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. గ్వాజిరా ప్రాంతంలోని అనేక తీర ప్రాంత పట్టణాల్లో ఈ వేడుక ప్రతి ఏడాది జరుగుతుంది. ఆఫ్రికా మూలాలున్న వీరు.. నజరీన్ పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తారు. రంగురంగుల దుస్తులు ధరించి, జనాలంతా రోడ్లపైకి చేరి, ఆడుతూ పాడుతూ వేడుకల్లో పాల్గొంటారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ నృత్యానికి 2012లో యునెస్కో గుర్తింపు కూడా దక్కింది. కాగా ఈసారి దీన్ని కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఆచరించడం విశేషం. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని