కరోనాపై పోరుకు డెంగ్యూ ఇమ్యూనిటి సాయం!   - dengue provide some immunity against Corona
close
Published : 23/09/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై పోరుకు డెంగ్యూ ఇమ్యూనిటి సాయం! 

బ్రెజిల్‌కు చెందిన అధ్యయనంలో వెల్లడి..

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా దాడి తీవ్రత మనలో ఉండే రోగనిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. దానితో పాటు వైరస్‌పై పోరాడటానికి శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు కొంతమేర కరోనా సోకకుండా అడ్డుకుంటాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూ వచ్చి వెళ్లిన తర్వాత రక్తంలో ఏర్పడే యాంటీబాడీలు కరోనాకు కొంత వరకూ చెక్‌ పెడతాయని బ్రెజిల్‌కు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. 2019, 2020లో ఈ వ్యాధి తీవ్రత ఉన్న ప్రదేశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసిన బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి కొత్త విషయాలను కనుగొన్నారు. డెంగ్యూతో బాధపడిన సమూహంపై కొవిడ్‌ పెద్దగా ప్రభావం చూపనట్లు గుర్తించారు. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ.. సార్స్‌ జాతికి చెందిన కరోనా వైరస్‌లలో కొంతమేర పోలికలు ఉన్నట్లు తేల్చారు. దీంతో పాటు డెంగ్యూ నివారణకు వాడే మందులు సైతం కరోనాపై కొంతవరకూ సమర్థంగా పోరాడతాయని ఆయన నిర్ధరించారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని