Bihar: నాగపంచమి సందర్భంగా సర్పాల ఊరేగింపు - devotees celebrated nag panchami in bihar with variety tradition
close
Published : 30/07/2021 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bihar: నాగపంచమి సందర్భంగా సర్పాల ఊరేగింపు

పట్నా: బిహార్‌లోని నాగపంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. బిహార్‌లో బెగుసరాయ్‌ జిల్లా, అగార్‌పూర్‌ గ్రామ పూజారులు ఓ నీటి కుంట నుంచి వందలాది పాములను బయటకు తీశారు. సర్పాలను మెడకు చుట్టుకుని విన్యాసాలు చేశారు. 1981లో అగార్‌పూర్‌ గ్రామంలో భగవతీస్థాన్‌ అనే మందిరం ఏర్పాటు చేయగా అప్పటి నుంచి గ్రామానికి ఎలాంటి సమస్యా రాలేదని స్థానికులు చెబుతున్నారు. పాములను పట్టుకునే సంప్రదాయాన్ని గ్రామభగత్‌ అని పిలిచే పూజారులు ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా సంస్థీపూర్‌ జిల్లాలోని విభూతీ పూర్లో వందల సంఖ్యలో పాములను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో యువకులు సర్పాలను పట్టుకుని రోడ్లపై తిరిగారు. సర్పాలను ఊరేగించడం, వాటితో విన్యాసాలు చేయడం వల్ల తమకు మంచి జరగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని