వ్యాక్సిన్లపై డీజీసీఐ కీలక ప్రకటన రేపే - dgci key press meet tomorrow
close
Published : 02/01/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్లపై డీజీసీఐ కీలక ప్రకటన రేపే

దిల్లీ: దేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతిస్తూ డీజీసీఐకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై డీజీసీఐ రేపు కీలక ప్రకటన చేయనుంది. ఆదివారం ఉదయం 11గంటలకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ మీడియాతో మాట్లాడనున్నారు.

మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కోసం 75లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించిన కో-విన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వీరంతా దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీకి ముందు చేపట్టిన మాక్‌డ్రిల్‌లో భాగంగా ఈ రోజు ఉదయం 9గంటలనుంచి దేశ వ్యాప్తంగా 125 జిల్లాల్లోని 286 ప్రాంతాల్లో డ్రైరన్‌ నిర్వహించినట్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్‌పై 1,14,100మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపింది. 

ఇవీ చదవండి..

గుడ్‌న్యూస్‌: కొవాగ్జిన్‌కూ గ్రీన్‌ సిగ్నల్‌

దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత టీకా!

దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని