సందడి చేస్తోన్న ‘ధక్‌ ధక్‌ ధక్‌’ టీజర్‌ - dhak dhak dhak song teaser from uppena
close
Published : 11/02/2021 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సందడి చేస్తోన్న ‘ధక్‌ ధక్‌ ధక్‌’ టీజర్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: గతేడాది విడుదలైన ‘ధక్‌ ధక్‌ ధక్‌’ గీతం (లిరికల్‌ వీడియో) శ్రోతల్ని ఎంతగానో అలరించింది. వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రంలోని పాట ఇది. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ధక్‌ ధక్‌ ధక్‌ సాంగ్‌ టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నాయకానాయికల హావభావాలు, సముద్ర తీరం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. శరత్‌ సంతోష్‌, హరిప్రియ ఆలపించారీ గీతాన్ని. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విభిన్న ప్రేమకథా నేపథ్యంలో రూపొందిందీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ సంస్థలు నిర్మించాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ చక్కటి ప్రేమ గీతాన్ని మీరూ వీక్షించండి...

ఇదీ చదవండి..

ఆయన లేకపోతే ‘ఉప్పెన’ ఒంటరయ్యేది: బుచ్చిబాబు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని