Dhanush: ‘రౌడీ బేబీ’కి స్ఫూర్తి ఇదే - dhanush about rowdy baby song
close
Published : 09/06/2021 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhanush: ‘రౌడీ బేబీ’కి స్ఫూర్తి ఇదే

ఇంట‌ర్నెట్ డెస్క్‌: త‌మిళ న‌టుడు ధ‌నుష్‌లో గాయ‌కుడు, పాట‌ల ర‌చ‌యిత కూడా ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. స్వీయ ర‌చ‌న‌లో ఆయ‌న ఆల‌పించిన పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ జాబితాలో ముందుంటుంది ‘రౌడీ బేబీ’. ‘మారి 2’ చిత్రం కోసం ధ‌నుష్ రాసి, పాడిన‌ ఈ గీతం యూ ట్యూబ్‌లో ప‌లు రికార్డులు నెల‌కొల్పింది. ఇప్ప‌టికీ ఈ పాట‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అంత‌గా త‌న సాహిత్యంతో మాయ చేశాడు ధ‌నుష్‌. అల‌తి పదాల‌తో పాట‌ని రాసి శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాడు. ‘హేయ్ ఎన్ గోలీ సోడా వే’ అనే చ‌ర‌ణంతో ప్రారంభ‌మ‌య్యే ఈ పాట‌కి స్ఫూర్తి ‘ఈ గోలీ సోడానే’ అంటూ ఓ ఫొటోని ఇన్‌స్టాలో పంచుకున్నారు ధ‌నుష్‌.

కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ న‌టించిన ‘జ‌గ‌మే తంత్రం’ జూన్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్ర‌స్తుతం ‘గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్నారాయ‌న‌. త‌మిళంలో ఓ చిత్రం, హిందీలో మ‌రో చిత్రం ఖ‌రారు చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని