జర్నలిస్టులుగా ధనుష్‌... మాళవిక! - dhanush and malavika mohanan play journalists in d43
close
Published : 21/07/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జర్నలిస్టులుగా ధనుష్‌... మాళవిక!

చెన్నై: విభిన్నమైన పాత్రలో పోషించి మెప్పించే ఈ తరం నటుల్లో తమిళ కథానాయకుడు ధనుష్‌ ఒకడు. ఇటీవలే ‘జగమే తందిరం’లో గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ధనుష్‌... తన 43వ చిత్రంలో జర్నలిస్ట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌ కథానాయిక. ఈమె కూడా ఇందులో జర్నలిస్టు పాత్ర పోషిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్, మాళవికల జోడి అలరిస్తుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోనే సాగుతోంది. ఇటీవలే మాళవిక మోహనన్‌ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసుకొని ముంబయికి తిరుగు ప్రయాణమైంది. ‘పేట’, ‘మాస్టర్‌’ చిత్రాల్లో మెరిసిన ఈ ముంబయి భామ... మలయాళం, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకెళుతోంది. హాలీవుడ్‌ చిత్రం ‘గ్రేమ్యాన్‌’ పూర్తిచేసుకొని వచ్చిన ధనుష్‌ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ధనుష్‌ తొలి తెలుగు చిత్రానికి శేఖర్‌కమ్ముల దర్శకత్వం చేయనున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని