నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు: ధనుష్‌ - dhanush wins his second national award thanks vetrimaaran for believing in him
close
Published : 23/03/2021 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు: ధనుష్‌

చెన్నై: 2019 జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ధనుష్‌ ‘అసురన్‌’ డైరెక్టర్‌ వెట్రిమారన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన పట్ల తనకున్న ప్రేమను ఓ లేఖ రూపంలో రాసి ట్విటర్లో పంచుకున్నాడు. ‘ఒక గొప్ప వార్త విని సంతోషంతో నిద్ర లేచాను. ఈ ఆవార్డు సాధించినందుకు ఎంతోమందికి నేను కృతజ్ఞతలు తెలిపాలి. ముందుగా నా తల్లిదండ్రులకు, సోదరునికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ‘శివస్వామి’గా నాకు అవకాశమిచ్చిన వెట్రిమారన్‌కు నేను రుణపడి ఉంటాను. మా ప్రయాణం ఇప్పటిది కాదు. మొదటిసారి వెట్రిని బాలుమహేంద్ర ఆఫీసు దగ్గర కలిసినప్పటి నుంచి మా బంధం మరింత బలపడుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు సినిమాలు తీశాం. ఇక త్వరలో నాకోసం వెట్రి ఏం రాయబోతున్నాడనే ఆతృతగా ఉంది. అలాగే ఈ సినిమాకు అద్భుతమైన సంగీతమిచ్చిన జి.వి ప్రకాష్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నిర్మాత థానుకు, సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంత పెద్ద సక్సెస్‌ ఇచ్చి, గుండెల్లో పెట్టుకుంటున్న అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ ధనుష్‌ ముగించారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి యూఎస్‌లో ఉన్నారు. అక్కడ ‘గ్రే మ్యాన్‌’అనే హాలీవుడ్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని