Dhee 13: సుధీర్‌కి ప్రియమణి హగ్‌.. ఎందుకంటే! - dhee 13 latest promo trends in youtube
close
Updated : 16/07/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhee 13: సుధీర్‌కి ప్రియమణి హగ్‌.. ఎందుకంటే!

ట్రెండింగ్‌ ప్రోమో ఇది

హైదరాబాద్‌: బుల్లితెర నటుడు సుధీర్‌పై నటి ప్రియమణి ప్రశంసలు కురిపించారు. అతడి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ‘సుధీర్‌ ఎంతో టాలెంట్‌ ఉన్న వ్యక్తి .. అతడు ఎక్కడ ఉంటే అక్కడ స్టేజ్‌ అదిరిపోవాల్సిందే’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ప్రోమో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ-13’. ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌లో ప్రియమణి, గణేష్‌ మాస్టర్‌, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా.. టీమ్‌ లీడర్లుగా సుధీర్‌, ఆది, రష్మి, దీపిక ఉన్నారు. తాజాగా విడుదలైన ఓ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ‘ఓ రాజు కన్నుల్లో నువ్వే’ అనే పాటకు కంటెస్టెంట్‌తో కలిసి సుధీర్‌, రష్మి డ్యాన్స్ చేశారు. ఈ పాటలో సుధీర్‌ చేసిన డ్యాన్స్‌కు ప్రియమణి ప్రశంసలు కురిపించారు. వచ్చే బుధవారం ప్రసారం కానున్న ఈ షో ప్రోమోని మీరూ చూసేయండి..!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని