CSK గెలిచినా ఓడినా ఒకటే పద్ధతి: ధోనీ  - dhoni says whether you win or loose focus on the process not result
close
Updated : 29/04/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CSK గెలిచినా ఓడినా ఒకటే పద్ధతి: ధోనీ 

సరైన ఫలితాలు రానప్పుడే మనమేంటో తెలిసేది..

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాదితో పోలిస్తే తమ ఆటలో ఎలాంటి మార్పులేదని, గెలిచినా ఓడినా తాము ఒకటే పద్ధతి పాటిస్తామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు. ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన 69 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికైన జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఒంటిచేత్తో బెంగళూరును మట్టికరిపించిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మహీ మాట్లాడుతూ చెన్నై ఆటతీరుతో పాటు జడేజాపై ప్రశంసల జల్లు కురిపించాడు.

‘జడేజా ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాలను మార్చగలడు. ఈ రోజు అటు బ్యాట్‌తో, ఇటు బంతితో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతడికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించడం మంచి విషయం. అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. జడేజా దాన్ని అందిపుచ్చుకున్నాడు. అయితే, మ్యాచ్‌ ఫలితం ఎలా ఉంటుందనేది ముందే అంచనా వేయలేం. తొలుత మేం కూడా బ్యాటింగ్‌ చేయాలా, బౌలింగ్‌ చేయాలా అనే విషయంపై సందిగ్ధంలో పడ్డాం. అలాగే మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చారు’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.

‘మా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో జడేజా సాధించిన అదనపు పరుగులు జట్టుకు ఉపయోగమని చెప్పొచ్చు. మేం 160-170 స్కోర్‌ సాధించాలనుకుంటే అదనంగా 20-25 పరుగులు వచ్చాయి. దాంతో ఛేదనలో బెంగళూరు మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలోనే ఆ జట్టును ఆదిలో, మధ్యలో వికెట్లు పడగొడితే ఇన్నింగ్స్‌ నిర్మించుకునేందుకు కష్టమవుతుంది. అదే మా ప్రణాళిక. అలాగే గతేడాదికీ, ఇప్పటికి మా ఆటలో ఎలాంటి మార్పులేదు. గెలిచినా, ఓడినా మేం ఒకేలా ఉంటాము. ఫలితం గురించి కాకుండా పద్ధతి మీద దృష్టి సారిస్తాం. ఓటములు ఎదురైనప్పుడే మన వ్యక్తిత్వానికి అసలు పరీక్ష ఎదురవుతుంది. అప్పుడే మనకు మరింత ఎక్కువ గౌరవం లభిస్తుంది. మాటల కన్నా చేతలే ఎక్కువ ప్రభావం చూపుతాయనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. అదే మా ఆటగాళ్లకు నమ్మకం కలిగించింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాక మా ఆటగాళ్లు ఒత్తిడికి గురై ఉండొచ్చు. ఎందుకంటే గతేడాది పేలవ ప్రదర్శన చేసి ఇక్కడికి వచ్చాం’ అని ధోనీ వివరించాడు.

కాగా, ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లో జడేజా (62*; 28 బంతుల్లో 4x4, 5x6) చివరి ఓవర్‌లో ఐదు సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్‌తో పాటు నోబాల్‌ పడటంతో మొత్తం 37 పరుగులు సాధించాడు. దాంతో చెన్నై 20 ఓవర్లకు 191/4 స్కోర్‌ సాధించింది. ఆపై బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని